Monday 7 June, 2010

award winning cinema

1940 లో ఒక గ్రామం.
ఎక్కడో ఒక లింక్ దొరికితే down lode చేసుకొని  ఈ సినిమా చూసాను..
దీనికి ఎందుకు అవార్డ్స్ ఇచ్చారో తెలిదు.
 చాల మాములు కథ. అంతా కంటే మాములుగా తీసారు.
ఒక బ్రామ్హణ న అగహారం లో అన్య జాతి వాళ్ళకి జరిగే అన్యాయం..
ఒక ముసలి బ్రామ్హనుడు ఒక యవ్వనవతిని పెళ్లాడితే, ఒకానొక టైం లో.. ఆ పిల్ల అన్య జాతి వాడితో జతకడితే  అది తెలిసి వాళ్ళని ఉరినుండి  వేలివేయటం......పర్యవసానం..పశ్చాత్తాపం ...
 ఇది ఒక కథేనా అని అనిపించిన్చినా 1940 ని దృష్టిలో పెట్టుకొని,  అ నాటి సంఘీక  పరిస్థితులని దృష్టిలో ఉంచుకొంటే  కనక కథ ఓకే. కాని కథనం లో,  నూతనత్వం లేకపోటం.
 వేష బాషలలో.. ఆ period ని చూపించలేక పోవటం.
 కన్నె పిల్ల కనే కలలు.. అ కలలు కల్లలవుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడక  పోవటం..
 బోల్డ్ గా అ పిల్ల పడే అవస్థ   చూపించలేక పోటం.
నటుల ఎంపిక, వాళ్ళ మాటలు బొత్తిగా commercial సినిమాలో మల్లె ఉండటం.


మొత్తానికి నటులు, మాటలు , స్క్రీన్ ప్లే  ఆర్ట్, సినిమాటోగ్రఫీ పేలవం.
 ఏదయినా నచ్చిన అంశం అంటూ ఉంటె... మల్లె పువ్వులా.. అనే పాట మాత్రమే.ఆది కింద లింక్ నొక్కి వినండి . 
  <p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/1940+Lo+Oka+Gramam.html?e">Listen to 1940 Lo Oka Gramam Audio Songs at MusicMazaa.com</a></p>



No comments: