Friday 11 June, 2010

ప్రపంచ సినిమా



మనలో చాలామందికి తెలుగు, హిందీ సినిమాలు బాగా పరిచయం. కాని ప్రపంచ సినిమా గురిచి తెలిసిన వాళ్ళు తక్కువనే చెప్పాలి. ప్రపంచ సినిమా అంటే వివిధ బాషలలో వివిధ దేశాల్లో నిర్మించిన సినిమాలు. మన భారత దేశంలో నిర్మించిన చాల సినిమాలు ఈ ప్రపంచ సినిమా ని ఇన్స్పిరేషన్ గా తెసుకొని తీసినవే.  ఏ ప్రపంచ సినిమాలు చాల మందికి తేలికపోటం వల్ల , దానికి తోడు మనం చాల విషయాల్లో వెనకబడి ఉండటం, నిరక్షరాస్యత   ఎక్కువగా ఉండటం వల్ల,  మన వాళ్ళు ఇంకా libido ని activate సినిమాలు మాత్రమే ఎక్కువగా  తీస్తున్నారు.
కాని ఒక్క సారి ప్రపంచ సినిమా మనకి పరిచయం అయితే,  వాటిల్లో ఉండే రసాత్మకత అర్థం అయితే ఈ మూసపోకడ  సినిమాలు  చూడాలని అనిపించదు.
ప్రపంచంలో కేవలం ఆస్కార్ కాకుండా వివిధ రకాల సినిమా పండగలు జరుగుతాయి. ఆస్కార్ అనేది కేవలం ఇంగ్లీష్  బాషలో  తయారైన సినిమాలకి మాత్రమే. 
కాని వివిధ దేశాలూ తమ తమ బాషలలో  సినిమాలు రూపొందిస్తున్నారు. అవి వివిధ రకాల cinema పండుగలలో  బహుమతులు గెలుచుకుంటున్నాయి. అలంటి సినిమాల్లో నిజమయిన రసాత్మకత మనం చూడగలం.
ఈ సినిమాలు చాల వరకు ఇంటర్నెట్ లో మనం downlode చేసుకోగలం.  మేకు బయట DVD లు కావాలంటే cinema paradiso ( నాగార్జున సర్కిల్, హైదరాబద్  ) లో దొరుకుతాయి.
లేదా మీరు హైదరాబాద్ మూవీ క్లబ్ లో member అయితే గనక ప్రతివారం ఒక cinema ప్రదర్శన ఉంటుంది. సారథి studios లో.

ఈ  ప్రపంచ  సినిమా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే  నవతరంగం .కం  ని చదవండి.