Sunday 4 July, 2010

"" నాకు నచ్చిన సినిమా *MIDAQ ALLEY* (Mexican )

Naguib Mahfouz'  అనే ఈ జిప్ట్ రచయిత కి నోబెల్ బహుమతి  తెచిపెట్టిన "midaq ally" అనే నవల  ఆధారంగా నిర్మితమైన
ఈ సినిమా ఒక  భిన్న కథల సమాహారం.
1) teenage లో ఉన్న ఒక తండ్రి లేని  ఓ పిల్ల ఆమె తల్లి ,
యుక్త వయస్సులో ఉండే confusion.. ఆశలు..
ఎలాగోలా..ఎవరికో ఒకరికి ఇచ్చి పిల్ల పెళ్లి చేయాలని ఆ తల్లి ఆరాటం.
2) అమ్మాయి ప్రేమకోసం తపించే ఓ' పేద' హృదయం..
3) ఒక మధ్య తరగతి కుటుంబం..అందులోని సంఘర్షణ ..ప్రేమ ఆప్యాయత 4) పెళ్లి కాని ఒక నడి వయస్కురాలి తపన
మొత్తం మీద మధ్య తరగతి  మనుషుల LOVE, LUST and LIFE is MIDAQ ALLY  ""

అల్మిత ఒక అందమైన మధ్య తరగతి అమ్మాయి. teenage లో ఉన్న ఆఅమ్మాయికి తండ్రి ఉండదు. వయసుకి తగ్గట్టుగానే మగాడి పొందు కావాలని కోరుకుంటుంది. కాని ధైర్యం చాలదు. తన ఫ్రెండ్స్ తో అదే విషయం చెబుతూ ఉంటుంది.

Abel అనే ఒక కుర్రాడు బార్బర్ షాప్ లో పని చేస్తుంటాడు. అతనికి అల్మిత అనే ప్రాణం. అదే విషయం అల్మితకి చెబుతాడు. కాని అల్మిత అతనికి ఎలాంటి సమాధానం చెప్పదు. ఎందుకంటే ఆమెకి కావాల్సింది వేరు.
Able ఫ్రెండ్ chava . అతని తండ్రి బార్ షాప్ యజమాని . chava కి తండ్రి కి పడదు. ఇద్దరు తరచూ గొడవ పడుతూ ఉంటారు.. దాంతో chava విదేశాలకి వెళ్లి గొప్ప వాడుగా తిరిగి రావాలని అనుకొంటాడు. Able కి కుడా తోడూ రమ్మని, డబ్బు సంపాదించుకొని వొచ్చి తాను ప్రేమించే అల్మితని పెళ్లి చేసుకోవచ్చని చెపుతాడు.  

అల్మిత Abel ప్రేమని అంగీకరించిన తరువాత ఒకానొక రాత్రి Able అల్మిత తలుపు తట్టి తాను విదేశానికి వెళ్తున్నానని డబ్బు సంపాదించుకొని వొచ్చి తనని వివాహమడుతానని, తనకై వేచి ఉండమని కోరతాడు. ఇద్దరు ప్రమాణాలు చేసుకుంటారు.
కాని అల్మిత చాల కాలంగా తన వెంటపడుతున్న ఒక మధ్య వయస్కునితో తిరుగుతుంది. అతను ఆమెకి డబ్బు , దాంతో దొరికే సుఖాలని రుచి చూపిస్తాడు.అనుకుంటే తను కూడా సంపాదించ వచ్చని చెపుతాడు.
ఒకరోజు ఆమెని తనతో ఒక చోటుకి తెసుకొని వెళ్తాడు అక్కడ అల్మితకి అతని నిజరూపం తెలుస్తుంది. తాను మోసపోయానని విలపిస్తుంది. Able ని, అతని ప్రేమని తలచుకొని ఏడుస్తుంది. కాని ఒకానొక పరిస్తితిలో మళ్లీ అ పెద్ద మనిషి కి లోంగిపోతుంది.
Able కొంత డబ్బు కుడబెట్టుకొని కోటి ఆశలతో తిరిగి వొస్తాడు. అల్మిత కనిపించదు. ఆమె చాల రోజులుగా కనిపించకుండా పోయిందని తెలిసి తాగుబోతుగా మారతాడు.
చివరికి   chava ద్వారా అల్మిత ఎక్కడ ఉన్నది కనుక్కొని కుమిలిపోతాడు.
ఆ తరవాత ఏం జరింగింది అనేది చూడాల్సిందే.

మధ్యతరగతి మనస్తత్వాన్ని కళ్ళకి   కట్టినట్టు చూపిస్తారీ  చిత్రంలో. female attitude కూడా high lite చేయబడింది. అల్మిత గా salma hyake నటన అద్భుతం.
Able డి జాలి గొలిపే పాత్ర.


Director :Jorge Fons
Cast: Salma Hayek, Bruno Bichir

No comments: