Saturday 13 November, 2010

పాట.


తెలుగు సినిమాకి సంభందించి.
ఏ ఒక్క సందర్భాన్ని వదలకుండా పాటలు రాసారు, తీసారు . నవరసాల్లోను  పాటలున్నాయి.

అమ్మాయి దొరికినా పాట.. దొరకకున్నా  పాట.
పెళ్లి కుదిరితే పాట...కుదరకున్నా  పాట.
దేవుడా నేవే దిక్కు అని పాట, అసలున్నావా అని పాట.
దేవుడిని  పొగడుతూ పాట, తిడుతూ పాట.
సమాజాన్ని తూర్పార పడుతూ  పాట.
మానవత విలువలు చచ్చి  జనం ఏనాయిపోతున్నారో అని ఒక పాట
కాలం మారదని ఒక పాట..నిత్యం మారేదే కాలమని ఇంకో పాట.
గెలుపే ముఖ్యమని ఒక పాట..ఆది శాశ్వతం కాదని పాట.
జీవితం అంటే.. పోరాటం అని...ఆట అని.. సప్త సాగర మథనం అని,, కల కాదని..
సుఖ దుఖాల సంగమం అని..అదో ప్రయానమనే.. స్నేహమనీ  ఎన్నో పాటలు..
మనసునిండా ఆనందం నిండినా పాట .. గుండెలో  ఏడుపు ఎగదన్నినా పాట.
అన్నయ్యా అని ఒక పాట, చెల్లెమ్మ అని ఇంకో పాట
పిల్లలకి కథ చెపుతూ ఒక పాట, నిద్ర పుచుతూ మరో పాట.
పాడాలని ఉంది అని పాట , నాకు పాట రాదు అంటూ  పాట. ఇదీ పాటే కాదు అని ఇంకో పాట

అన్నయ్య , చెల్లెలు, కుటుంబం, అమ్మా, నాన్న, తలిదండ్రులు,  దేవుడు, ప్రేమ, విరహం, వేదన, నిరాశ, చావు, పుట్టుక, పుట్టిన  రోజు,  కోపం, కసి , అలక, అందం, పెళ్లి, పెళ్లి కూతురుని వర్ణన,  ప్రేయసి వర్ణన, శృంగారం, ద్వందార్థం, హీరోఇజం,
ప్రకృతి, నదులు, జలపాతాలు,దేశం, బాష ....
దేనినీ  వొదిలి పెట్టలేదు.
దున్నేసారు ..ఏమి మిగలకుండా..
మనం ఇప్పుడు చేయాల్సింది..వాటినే కొత్తగా ఎలా రాయాలి ఎలా చూపాలి అని. అంతే.

No comments: