Saturday 27 November, 2010

మహిళా దృక్పథం


 పొద్దున్న లేస్తే "మగబుద్ది" అని అంటారు . మేము గాళ్స్ మి  బాబు.. మీలాగా కాదు.అని ఎంతో మంది అమ్మాయిలు   రొటీన్ డైలాగ్ కొడుతూనే  ఉంటారు కదా.
కొంత మంది మగ దర్శకులు/రచయితలు వాళ్ళు చుట్టూ ఉన్న,   చూసిన స్త్రీ ల స్పూర్తి తో  స్త్రీ ప్రవర్తనని కొంత వరకు ఉహించగలరు. కొంత ఉహ కొంత నిజం తో తమకు కావలసిన  charectors సృష్టించగలరు. అ రచయిత  కూడా  ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చెప్పగలరేమో కాని ఎందుకు అలా ప్రవర్తిస్తుందో  తెలిదు..
చలం స్త్రీ ని   బాగా అర్థం చేసుకోన్నాడని  ఎంతో మంది రచయిత్రులు చెప్పారు. ఆది అతని రచనల్లో ఆది స్పష్టంగా కనపడుతుంది మనకి.
 "స్త్రీ కొంచం సిగ్గు పడినా...కోప పడినా ఆమెలో ప్రేమని రగిలించవచ్చు " 
"ఒక స్త్రీ మాటలవల్ల గానీ. చూపుల వల్ల గాని మగాడికి సందు ఇచ్చిందా.. ఇక  అతని ప్రార్థనలకి, అధికారాలకి, కోరికలకి అంతే ఉండదు."
7 /జి  బృందావన్ కాలనీ పైన చెప్పిన చలం గారి మాటలకి  చక్కని ఉదాహరణ. అ సినిమాలో అమ్మాయి ప్రవర్తన అలాగే చూపించారు. అందరూ  అలా  అలా ఉండకపోవోచ్చు కాని కొంతలో కొంత female attitude reflect అయిందన్న మాట వాస్తవం.  హీరోని ఒక వేస్ట్ ఫెల్లో లాగ చూసే అమ్మాయికి ఒకానొక క్షణం లో జాలి కలిగి పోనిలే అని మాట్లాడితే.. ఇంక friendship ..ప్రేమ అని వెంటపడతాడు. ఆమెకి confusion .  ఏది స్పష్టంగా చెప్పదు. కాని ఒక్కసారి ప్రేమే అని అనిపించాక ఇక తనకి తాను ఇవ్వటానికి రెడీ అవుతుంది. 
" ఇంకో హృదయం తనకోసం పరితపిస్తుందంటే.. స్వయంగా ఇష్టం లేకపోయినా స్త్రీ హృదయం సంతోశించకుండా ఉండదు. సుస్వభావులు జాలి పడి తీరతారు. " అంటాడు చలం.
దీనికి   "ఏ మాయ చేసావే" ఒక ఉదాహరణ.  లోకంలో ఇంతమంది అమ్మయిలుండగా నేను జెస్సీ నే ఎందుకు ప్రేమించాను అని  మేల్ perspective లో నడిచే సినిమా అయినా   స్త్రీ సహజ మైన confusion,  " ప్రేమిస్తున్నా" అనగానే  జాలి కలగటం. అ జాలి + curiasity   తో ఒక కొన చూపులు  విసరటం, ఇష్టం ఉండి లేనట్లు  మాట్లాడటం.. అదే  రాను రాను ఆది ప్రేమగా మారటం, ఇక ప్రేమ చిక్కగా  బలపడ్డాక   దాన్లోంచి తెగింపు రావటం.  మొత్తం statement ని ఈ  సినిమా  సంతృప్తి పరచక పోవొచ్చు కాని..దాదాపు అలాగే ఉంటుంది సినిమా.కనిసం పాతిక శాతం అయినా  women attitude కరెక్ట్ గా చూపించారు అనిపించింది.
 అమ్మాయిని  చూడగానే మగవాడికి నచ్చేస్తే,  అమ్మాయికి మాత్రం  టైం కావాలి.మాట్లాడాలి..తిరగాలి. తనకు అతని ప్రేమపై నమ్మకం కలిగిన  తరవాతే..ప్రేమకి ఓకే అంటుంది.
ఇలా కొన్ని సినిమాల్లో కొంతలో కొంత " స్త్రీ " మనసత్వం కనపడింది.
 ప్రతి విషయం లోను.. "ఆమె"  భిన్నంగా ఉంటుంది. ఆది స్త్రీ కే తెలుసు.

No comments: