Thursday 2 December, 2010

"తెలుగు సినిమా" - పునరుజ్జీవనం


 ఒకసారి వర్మ ఇంటర్వ్యూ చూసాను.. పెద్దగా గుర్తులేదు..సందర్భం..కాని అయన ఇచ్చిన  సమాధానం మాత్రం బాగా గుర్తుంది.
సర్ ఈరోజు మనకి మంచి సినిమా రావటం లేదు . ..పాత్రికేయిని   ప్రశ్న పూర్తి కాకుండానే..  వర్మ సమాదానం ఇచ్చ్చారు.
"మంచి సినిమా.. నా జేబులో ఉంది..తీసుకోండి..( వెటకారంగా)
ఎవడి standards   బట్టి వాడు సినిమా తీస్తున్నాడు. ఆది  మంచి సినిమా అనే  అనుకుంటాడు." 
ఆ సమాధానం లో  కొత్తదనం లేకపోయినా .. ఈ standards ని ఎలా సంపాదించుకోవాలి? ఎలా పెంచుకోవాలి ? అని మాత్రమే నా ఆలోచన .

ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ సినిమా నగరాలలోకి పాకింది... పొద్దున్న లేస్తే నూటికి పైగా రకరకాల చానెల్స్..న్యూస్ చానల్స్ కూడా ఎలా entertain చేద్దామా అని ఆలోచిస్తున్న తరుణం ఇది.
 హిందీ రంగం మూవీ మేకింగ్ పరంగా ఎంతో ముందుంది. అ హీరోలు  ఇమేజ్   చట్రం నుండి ఎప్పుడో  బయటపడి experimental   సినిమాకి రెడీ అయ్యారు. ఓ పక్క తమిళులు  అన్ని రంగాలలో ఆరితేరి తమదైన మార్క్ వేయగలుగుతున్నారు. భిన్నమైన సినిమాలు తీయగాలుగుతున్నారు.
దానికి కారణం ఈ మధ్య వొచ్చే తమిళ నిపుణులు "  సినిమా జ్ఞానం  " తెలిసిన వారు  అయి ఉండటమే.
భావోద్వేగాలు,మానసిక అంతర్మధనాలు, మానవతా విలువలకి nativity జోడించె  కథలకి .. "ప్రపంచ సినిమా"  ఉంది.
థ్రిల్లింగ్, ఆక్షన్, హర్రర్   సినిమాలకి, గ్రాఫిక్స్  జోడించే హాలీవుడ్ సినిమా ఉంది.
గాల్లోనే విన్యాసాలు  చూపే ..చైనా  సినిమా ఉంది.
మనసుకి సున్నితంగా హత్తుకుపోయే  కొరియన్ సినిమా  ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో  "తెలుగు సినిమా" ఉనికి ఏంటి  ?
ఈ ప్రశ్నకు నాకు కూడా ఖచ్చితమైన సమాధానం తెలిదు.కాని ప్రస్తుతం  ఖచ్చితంగా  "తెలుగు  సినిమా" కి పునరుజ్జీవనం అవసరం అని మాత్రం అనిపిస్తోంది . 


తెలుగు సినిమా అనగానే గుర్తోచ్చె  సినిమాలు చాలానే ఉన్నాయి. కాని  అవి ఎప్పటివో. ఈ మధ్య కాలంలో అలాంటివి  మాత్రం లేవు.

దర్శకత్వ, రచన రంగాల్లో తలనేరిసిపోయిన వాళ్ళు కూడా ఇంకా LIBIDO మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారు.ఇంకా ఎంతకాలం అలా తీస్తారో తెలీటం లేదు.
మొన్నెప్పుడో  జరిగిన FICCI లో అందరూ.. సినిమా ఎలా మార్కెట్ చేసుకోవాలి సినిమా పేరు మీద డబ్బు ఎలా సంపాదించాలి అని తప్ప "తెలుగు సినిమా " పరిస్థితి  ఏంటి అని మాత్రం మాట్లాడినట్టు లేదు.
of course సభా వేదికనే   " సినిమా వ్యాపారం"  అనుకోండి.
సినిమా అంటే వ్యాపారం.. లేదా pure entertainment అని భావించే వాళ్ళంతా ఎక్కువై  sensible సినిమా కరువైంది.
వివిధ  "జెనర్"  కి సంభ్నదించిన సినిమాలు రావటం లేదు .
ఒకవైపు వారసత్వ హీరోలు.. కుల వర్గ పోరాటాలు, చెట్టు పేరుతో కాయలమ్మే  వేషాలు.  చిన్న సినిమాకి theater లేక...పెద్ద సినిమాలకి జనాలు రాక  "తెలుగు సినిమా"  పరిస్థితి దిగజారి పోయింది.

ఖచ్చితంగా మారాల్సిన మొదటి విషయంఏంటంటే  "ఇమేజ్  చట్రం లో పడి తమకి తాము బందీలుగా మారిపోయిన హీరోలు". అభిమానులు  ఆదరించరు అన్న పేరుతో మూస పాత్రలు  చేస్తున్నారు.హెయిర్ స్టైల్ మార్చో, మీసాలు కత్తరించో భిన్న మైన గెట్ అప్ లో కనపడుతున్నారు తప్ప, కథ ని ఎంచుకునే విధానం లో, నటన పరంగా, రసానందం పొందటంలో, అందించటం లో  ఏ మాత్రం మార్పు ఉండటం లేదు. చుట్టూ ఉండి వాళ్ళని ప్రోత్సహించే  వాళ్ళ వర్గం, సినిమా పరంగా నిరక్షరాస్యులు ఐ ఉండటమే దీనికి ఒక పెద్ద కారణం.  మూడు "మూస" సినిమాలు తీసినా కనిసం ఒక  "కళాత్మక " సినిమా తీయాల్సిన భాద్యత ప్రతి హీరో కి ఉంది. అదే తెలుగు కళామతల్లి కి నిజమైన సేవ.  చెప్పుకోటానికి ఓ రెండు సినిమాలు మిగిలుంటాయి. అధిక సంఖ్యలోఉన్నఅభిమానులు అలాంటి సినిమానే కోరుకుంటున్నారు కనక మేము అదే తీస్తున్నాం అనకుండా,  తక్కువ సంఖ్యలో అయినా తమకి  క్లాసు అభిమానులు కూడా ఉన్నారని వాళ్ళనీ సంతృప్తి పరచాల్సిన భాద్యత "హీరోలు గా" తమకి ఉందనీ గుర్తెరగాలి. 
హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తుంటే చొంగలు కారుస్తూ చూడాలా??
వెనకాల ఏమైనా చేసుకోండి.. తెర మీద మాత్రం వొద్దు.
ఇక హీరోయిన్   glamor పేరుతో అంగ ప్రదర్శన చేస్తూ ... జస్ట్ I can say Stop projecting ur image as a prostitutes. కావాలంటే అదే పని చేయండి కాని స్క్రీన్ మీద కాదు.

ఖచ్చితంగా మారాల్సిన రెండో  విషయం
ఈ మధ్య  జరిగిన ఓ  ఆడియో  విడుదల  ఫంక్షన్ లో ఓ నిర్మాత తన  సినిమా ఫ్లోప్ మీద విరుచుకు పడ్డారు. దానికి మొత్తానికి మొత్తంగా ఇతరులని బాధ్యులని చేసారు."సినిమా " విషయంలో  అవగాహన. అభిరుచి  ఉండాల్సింది ముఖ్యంగా నిర్మాతకి. combination ని నమ్ముకోక కథని శ్రద్దగా  విని.. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అదీ పెద్ద మొత్తంలో పెట్టె టప్పుడు  ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముప్పై, నలభై కోట్లతో సినిమా నిర్మించే బదులు.. తలా మూడు, నాలుగు    కోట్లతో నాలుగు  చిన్న సినిమాలు  నిర్మిస్తే.. కొత్త సినిమా, కొత్త దర్శకులు పరిచయం అవుతారు.. అందులో ఏ ఒక్క సినెమా హిట్ అయినా రావాల్సిన లాభం వొచ్చేస్తుంది. కనీసం అప్పటిదాకా కలిగిన నష్టం పూడుకొని పోతుంది. 
గొప్ప లాభం సంపాదించిన నిర్మాతలు కూడా "అభిరుచి" గల చిన్న సినిమా కి పెట్టుపడి పెట్టటానికి వెనకడుగు వేస్తున్నారు.
ఈ విషయం లో అమీర్ ఖాన్ నిర్మించిన   "పీప్లి  లైవ్ "  అనే సినిమా ఒక మంచి ఉదాహరణగా తీసుకోవొచ్చు.  కేవలం మూడున్నర కోట్లతో నిర్మించిన ఆ చిత్రం  దాదాపు ముప్ప్పై కోట్లదాకా అర్జించింది. అదీ కాక కొన్ని అంతర్జాతీయ  ఫిలిం పండగలలో చోటు కూడా సంపాదించింది. 
ఒకటికి రెండు సార్లు  కథ విని.. నచ్చి.. నూతన దర్శకురాలైన  అనుషా రిజ్వీకి కొన్ని సూచనలు చేసి.. ఆ తరవాత ఆమె ఎలా తీయగలదో కొన్ని సీన్లు  చిత్రీకరించుకొని  రమ్మని చెప్పి ..అ సీన్లు చూసాక.. నమ్మకం కలిగాక అప్పుడు నిర్మాణం ప్రారంభించాడు అమీర్ . ఇంకో విషయం ఏంటంటే..నిజాయితీగా తను అందులో ప్రధాన పాత్రకి సరిపోనని  ఆ పాత్రని చేయలేదు. కేవలం డబ్బు పోతుందేమో అన్న బాధ కంటే .. మంచి సినిమా తీయాలి అనే తపనే ఎక్కువగా ఉంది. 
combination's మారుస్తూ  తిప్పి తిప్పి మళ్లీ అదే సినిమా తీసేకంటే.. మనని మనం next లెవెల్ తీసుకెళ్ళే విధంగా సినిమా నిర్మించటం ఉత్తమం. అదీ కేవలం డబ్బు విషయం లో కాదు.  "సినిమా కళ" విషయం లో కూడా. 
 దర్శకుని కంటే ప్రతిభ, దూర దృష్టి,  అభిరుచి  ఎక్కువ ఉండాల్సింది  నిర్మాతకే.  నేడు  ఆది కొరవడి పోయింది. 

ఖచ్చితంగా మారాల్సిన మూడో  విషయం
ఇతర కారణాలతో  "అభిమానం " పెంచుకొని  అదీ  "విపరీతాభిమానం" గా మారిన   ప్రేక్షకులు కూడా సినిమా విషయం లో అవగాహన,కళాభిరుచిని పెంపొందించు కోవలసిన అవసరమూ ఉంది.నాణ్యమైన సినిమాలని కోరండి. ఆదరించండి. 
  మన "తెలుగుసినిమా" ని జాతీయ, అంతర్జాతీయ వేదిక పై నిలబెట్టాలంటే మన వంతుగా మనం ఏం చేయగలం ? 
                                         పోనీ
కాసులోక్కటే కాకుండా కాసింత కళా పోషణ ఎలా చేయగలం ?   

                                        పోనీ
వెకిలి  జోకులు, చౌక బారు శృంగారం..లాంటివి లేకుండా విభిన్న కథలతో జనరంజక సినిమా ఎలా తీయగలం ?
        ఇది ఎవరికీ వారు ప్రశించుకొని, ఆలోచించుకోవాల్సిన  తరుణం. 

     రానున్న సంవత్సరం లో  తెలుగుసినిమా కి శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ  "2011 " నూతన సంవత్సర శుభాకాంక్షలు.

No comments: