Monday 13 December, 2010

ఆర్య 2



మొన్నీమధ్యన ఆర్య 2 సినిమా చూసాను..
పరమ చెత్త సినిమా. స్నేహం, ప్రేమ, త్యాగం వీటిని  కలిపి ఒక పెద్ద కథ ని తాయారు చేద్దాం అని అనుకొని,
  హీరో కారెక్టర్ ని చాలా  విభిన్నంగా present  చేయాలనుకొని చేసిన కథ పేలిపోయింది.
ఆ ధ్యాసలో  హీరోయిన్ కి  ఒక శరీయం ..మనసు.. ఆశ  ..ఆలోచన  ఉంటాయాన్ని స్పుహ కూడా లేకుండా తయారు చేయబడింది.
"ఫీల్ మై లవ్"  అని  మొదలైన   ఆర్య గారి ప్రేమ  ఈ సినిమాలో   "I love u . నా ప్రాణం పోయినా". ..అంటాడు ..  ఇంకొన్నాళ్ళు పోతే    "you   love me .. లేదా ప్రాణం తీయనా "  అని అవుతుంది  ఆర్య - 3 కొచ్చేసరికి.
ప్రేమ పేరుతో దేశం లో ఒకవైపు నరుక్కోటాలు..ఆసిడ్ దాడులు జరుగుతున్నాయి రా మొర్రో అంటే.. అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈ సినిమాలు కుర్ర కారుని సైకో ల్లగా తయారు చేస్తున్నాయి.అదేంటి అంటే.. అర్రే సమాజానికి అద్దం పడుతున్నాం అంటారు.
సరే ఆ విషయాలన్నీ తోడితే   అంతా  మట్టే.. కనక వొదిలేస్తే  ఆర్య పాత్ర  కి  కొంచం అతి తగ్గించి.. హీరోయిన్ కి కొంచం శీలం లాంటిది పెడితే గుడ్డిలో మెల్ల లాగ నయంగా ఉండేది. ఇంకో విషయమ.. దీనికి ఆర్య 2 అని పేరు ఎందుకు పెట్టినట్టు ?
ఆర్య - 1 కి sequel ఆ ?? 

No comments: