Tuesday 7 December, 2010

వర్మ గురించి నా అభిప్రాయం


శివ సినిమాతో తెలుగు సినిమా దిశను దశను మార్చేసిన వర్మ.. తరవాత   గాయం, క్షణ క్షణం, అనగనగా ఒకరోజు.. లాంటి సినిమాలతో.. ఒక నూతన అధ్యాయం మొదలెట్టాడు. ఎంతోమంది ఈ ఈ కొత్త ఒరవడిని  చూసి పిచ్చెక్కి వర్మని  ఆదర్శంగా తీసుకొని సినిమాయే జీవితాశయం గా  చేసుకొని  ఫీల్డ్ కి వొచ్చారు. అందులో కొందరు ఆయన వద్ద  సహాయ దర్శకులు గా చేరి, కొంతమంది కేవలం అయన స్పూర్తి తో  వర్మ స్టైల్ లో సినిమాలు తీసి విజయం సాధిచారు.
ఈ లోపు  హిందీ చిత్రపరిశ్రమని అధ్యనం చేసి..   రంగప్రవేశం చేసి అక్కడా తనదైన  ముద్రని వేసుకున్నాడు.
మాఫియా , హర్రర్ చిత్రాలని  తీసిందే తీసి , ఒకటో అరో హిట్స్ సంపాదించాడు. సినిమాని తెరకెక్కించటం లో తనదైన సృజనాత్మక శైలి ఉన్నా విభిన్న మైన కథలు  తయారు చేయటంలో విఫలమయ్యాడు.
కంపెనీ, వర్మ కార్పోరేషన్ అనే సిని నిర్మాణ సంస్థ లని స్తాపించి సినిమాలు నిర్మించాడు.  అవి అంతే..  ఒకటో అరో విజయం సాధించాయి.
 తన ఆలోచనా ధోరణిలో.. ముక్కు సూటి మాటల్లో... పబ్లిసిటీ జిమ్మిక్కుల్ల్లో  తనదైన మార్క్  తో క్రేజ్ ని  సంపాదించుకున్నాడు.
తెలుగు హిందీ సినిమాలని గొప్పగా ప్రభావితం చేసిని ఈ సిని మేధావి.. తన ఆలోచనా పరిధిని  సృజనాత్మక శక్తిని పూర్తిగా వినియోగించుకున్నట్టు అనిపించదు. తనకి నచ్చింది,తోచింది  తాను చేస్తాను, చూడటం చూడక పోవటం అనేది ప్రేక్షకుల పని అన్నట్టు వాఖ్యలు చేయగలిగే దమ్ము ఉన్న దర్శకుడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే భారతీయ సినిమాని next level కి తీసుకెళ్ల గలిగే  స్థాయి అందరు దర్శకులకి  ఉండదు. కాని వర్మ అనుకుంటే ఆది చేయగల సమర్థత ఉన్నవాడు. కేవలం ఆవైపు ద్రుష్టి సారించక పోవటం వల్ల, తెలిసో తేలికో  తనకి తానే ఒక గిరి గీసుకోవటం వల్ల.  (అంటే ఒకే రకం సినిమాలు చేయటం)
ఒక్కోసారి ఆయన్ని  చూస్తుంటే "మనకి మనం విధించుకున్న బంధనాలే మనను ముందుకేల్లకుండా చేస్తాయి"  అన్న నానుడి కి సరిగ్గా సరిపోయే ఉదాహరణ అనిపిస్తూంది.
ఉదాహరణకి  slum dog milliner లాంటి  చిత్రం పెద్ద creative సినిమా కానే కాదు. దానికంటే గొప్పగా  సినిమా తీయగల సమర్థత వర్మకి ఉంది. కేవలం తను వాటిపై దృష్టి పెట్టకపోవటం తప్ప. ప్రపంచ స్థాయి సంకేతిక నిపుణులని రాప్పించుకోగలడు. భారి budget  నిర్మాతలని ఒప్పించగలడు. టాప్ ఇండియన్ నటులను ఎవ్వరినైనా తన సినిమాకి పని చేయించుకోగలడు. in fact  వాళ్ళు అలాంటి అవకాశం కోసం ఎదురుచుస్తున్నవారే.  వర్మ తో సినిమా అంటే వాళ్ళకీ గొప్ప ఉత్సుకత  ఉండే ఉంటుంది. ఇక మిగిలిందల్లా ఒక కథ ...  భారతీయ ఆత్మ ని ప్రపంచానికి చూపించగల ఒక కథ.  అనుకుంటే అదేమంత పెద్ద కష్టం కాదు.
సినిమాని ఇంకా లోతుగా అర్థం చేసుకొని తనని తాను  next లెవెల్ కి తీసుకెళ్ళే విధంగా.... మరిన్ని భిన్న చిత్రాలు చేయగలిగితే........

No comments: